స్వచ్ఛంద సేవకూ అడ్డంకులా? పీ-4 పిలుపుకు స్పందిస్తే కక్ష సాధింపా..? అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకోవడం సమంజసం కాదు: ప్రవీణ్‌నాయుడు

చిత్తూరు(రాజనీతి): ప్రజల కోసం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపడుతుంటే సొంత పార్టీ నాయకులే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చిత్తూరు రూరల్ మండలం అనంతాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రవీణ్‌నాయుడు ప్రశ్నించారు. శనివారం అనంతాపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చిన్ననాటి నుంచి టీడీపీ, చంద్రబాబునాయుడు అభిమానిగా ఉన్నానని, గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొన్నానని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (పీ-4) కార్యక్రమంతో స్ఫూర్తి పొంది సొంత నిధులతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు. గ్రామంలో దొంగతనాలు, హత్యల నేపథ్యంలో రూ.4 లక్షలకు పైగా వెచ్చించి వీధిదీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చర్చికి...