చైనా పై భారత మహిళల హాకీ జట్టు విజయం.. 44 ఏళ్ల తర్వాత స్వర్ణం!
రాజనీతి | స్పోర్ట్స్ | అక్టోబర్ 3, 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. చైనాతో జరిగిన ఫైనల్లో 1-0తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం. ఈ విజయంతో 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత కూడా సాధించింది. 10వ నిమిషంలో లాల్రెమ్సియామి గోల్ ఫైనల్ ఆరంభం నుంచే చైనా ఎక్కువగా బంతిని నియంత్రించినప్పటికీ.. భారత్ లభించిన అవకాశాన్ని గోల్‌గా మలిచింది. మ్యాచ్ 10వ నిమిషంలో లాల్రెమ్సియామి అద్భుతమైన రివర్స్ హిట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపింది. ఆమెకు ఇది 200వ అంతర్జాతీయ...