పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా క్రీడల్లో మరో స్వర్ణం!

రాజనీతి | స్పోర్ట్స్‌ | అక్టోబర్‌ 3, 2026 హసన్‌ నవాజ్‌ పోరాటం వృథా.. 19 పరుగుల తేడాతో పాక్‌పై విజయం! ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌ స్వర్ణాన్ని నిలబెట్టుకున్న టీమిండియా ఆసియా క్రీడల్లో భారత్‌ మరోసారి క్రికెట్‌ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన పురుషుల టీ20 ఫైనల్లో టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌ వరుసగా రెండో ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. అభిషేక్‌.. తిలక్‌...