నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి!....అనంత్ అంబానీ

రాజనీతి | మదనపల్లె | అక్టోబర్‌ 3, 2026 “రాష్ట్రానికి నేను ఏం చేయగలనో చెప్పండి.. మార్గనిర్దేశం చేయండి” – సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఆసక్తిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ వ్యక్తం చేశారు. మదనపల్లెలో జరిగిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ISA), గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ కార్యక్రమంలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఆంధ్రా బిడ్డగా భావించాలని, రాష్ట్రానికి తాను ఏ విధంగా సహకరించగలనో సూచించాలని కోరారు. “నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి” అనంత్‌ అంబానీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి, రాష్ట్రంతో తన...