శ్రీసిటీలో భారీ బాయిలర్‌ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి!

రాజనీతి | తిరుపతి | అక్టోబర్‌ 3, 2026 ఫార్మా పరిశ్రమలో ఒక్కసారిగా పేలుడు.. మరో 10 మందికి గాయాలు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించిన రెస్క్యూ బృందాలు తిరుపతి జిల్లా శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీసిటీలోని ఓ ప్రైవేట్‌ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో శనివారం ఉదయం వాటర్‌ బాయిలర్‌ పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి పరిశ్రమలోని కొంత భాగం దెబ్బతిని, పైకప్పు కూలిపోవడంతో కొందరు కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. నైట్‌ షిఫ్ట్‌ ముగిసే సమయంలో.. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో నైట్‌ షిఫ్ట్‌ కార్మికులు విధుల్లో ఉన్నట్లు అధికారులు...