జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే ఇక అంత ఈజీ కాదు!

రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్‌ 1, 2026 జనన, మరణాలను సకాలంలో నమోదు చేసుకోవడంపై కేంద్రం మరింత కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. Registration of Births and Deaths (Amendment) Act, 2026 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక జననం లేదా మరణం జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్‌లో జాప్యం పెరిగే కొద్దీ అదనపు ధ్రువీకరణలు, అధికారుల ఆదేశాలు అవసరం కానున్నాయి. 21 రోజుల్లో నమోదు చేస్తే సులభం అక్టోబర్‌ 1 నుంచి మారిన నిబంధనలు.. ఏడాది దాటితే అధికారుల ఆమోదం, రెండేళ్లు దాటితే మేజిస్ట్రేట్‌ ఆర్డర్‌ తప్పనిసరి జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు నమోదు చేసుకుంటే సాధారణ...