“బటన్‌ నొక్కడం నా విధానం కాదు”.. ప్రజలే మా ప్రతిపక్షం: చంద్రబాబు

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | అక్టోబర్‌ 1, 2026 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి, ప్రజలతో ప్రభుత్వానికి ఉన్న సంబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. కేవలం పథకాల నిధులు విడుదల చేసి “బటన్‌ నొక్కడం” తన విధానం కాదని, ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే తన ఆలోచన అని చెప్పారు. “సీఎం అంటే సచివాలయంలో కూర్చోవడం కాదు” సంక్షేమంతో పాటు ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం.. పేదరికాన్ని మానవీయ కోణంలో చూడాలన్న సీఎం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సేవకులని.. పెత్తందారులు కాదని చంద్రబాబు అన్నారు. తాను నెలకు నాలుగుసార్లు...