చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆదేశం..10వ వార్డు కుమార్ కార్యాచరణ.. ఇంటికే పింఛన్!

చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌మోహన్ ఆదేశాల మేరకు 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్‌ ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందజేశారు. లబ్ధిదారుల ఇబ్బందులను తెలుసుకుంటూ వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు ఎంతో భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు. పింఛన్‌ కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు.ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారని...