చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు ఖండించిన టీడీపీ 10వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్
చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్పై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి అంటే ఏమిటో సోషల్ మీడియాలో ప్రచారాలు చేసేవారిని కాకుండా నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని కుమార్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్...