అల్జీమర్స్‌కు కొత్త ఆశలు.. ముందే గుర్తిస్తే చికిత్సతో ప్రయోజనం!

రాజనీతి | హెల్త్‌ | సెప్టెంబర్‌ 29, 2026 వయసు పెరిగేకొద్దీ మతిమరుపు రావడం సహజమే అనుకుంటాం. కానీ రోజువారీ జీవితంలో అలవాటైన పనులు చేయలేకపోవడం, కొద్దిసేపటి క్రితం జరిగిన విషయాలను పదేపదే మర్చిపోవడం, తెలిసిన ప్రదేశాలకు వెళ్లే దారి గుర్తుపట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి అల్జీమర్స్‌ వంటి డిమెన్షియాకు సంకేతాలు కావచ్చు. మతిమరుపు.. అల్జీమర్స్‌ మధ్య తేడా మతిమరుపు కనిపిస్తే వయసు ప్రభావమే అనుకోకండి.. రక్తపరీక్షలతో ముందస్తు గుర్తింపు, వ్యాధి వేగాన్ని తగ్గించే ఆధునిక చికిత్సలు అందుబాటులోకి! అల్జీమర్స్‌ అనేది మెదడులో నాడీకణాల పనితీరు క్రమంగా దెబ్బతినే ప్రగతిశీల వ్యాధి. మెదడులో అమైలాయిడ్‌ బీటా ప్లాక్స్‌, టౌ ప్రొటీన్లు పేరుకుపోవడం...