చంద్రబాబు బాటలో.. లోకేష్ మార్గంలో..గురజాల జగన్ మోహన్ వెంటే!...చిత్తూరు 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్
చిత్తూరు(రాజనీతి): పార్టీ పదవి కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తానని చిత్తూరు 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ స్పష్టం చేశారు. 2015 నుంచి ఇప్పటి వరకు టీడీపీ కోసం పనిచేస్తున్నానని, భవిష్యత్తులోనూ పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో, మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న మార్గంలో ముందుకు సాగుతానని కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత...