స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | సెప్టెంబర్‌ 28, 2026 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఉద్యోగుల పదోన్నతులు, సెలవులు, ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, కారుణ్య నియామకాలు వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. నాలుగు కేటగిరీలకు ప్రమోషన్లు ప్రమోషన్లకు మార్గం.. సెలవుల వెసులుబాటు.. నోషనల్‌ ఇంక్రిమెంట్లపై పరిశీలన స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న నాలుగు కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతుల మార్గం తెరుచుకుంది. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలు, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలు, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలకు ప్రమోషన్‌...