సూది లేకుండానే ఇంజెక్షన్.. వైద్య రంగంలో కొత్త టెక్నాలజీ!
రాజనీతి | ఆరోగ్యం | సెప్టెంబర్ 28, 2026 ఇంజెక్షన్ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది సూది.. నొప్పి.. భయం! అయితే ఇక సూది లేకుండానే మందులను శరీరంలోకి పంపించే సాంకేతికత వైద్య రంగంలో అందుబాటులో ఉంది. దీనినే నీడిల్-ఫ్రీ ఇంజెక్షన్ లేదా జెట్ ఇంజెక్షన్ టెక్నాలజీగా పిలుస్తారు. అధిక పీడనంతో మందు ద్రవాన్ని చర్మం లోపలికి పంపడం ఈ విధానంలోని ప్రధాన సూత్రం. అసలు ఎలా పనిచేస్తుంది? చర్మాన్ని చీల్చే సూది అవసరం లేకుండా మందులు శరీరంలోకి.. నొప్పి, సూది భయం తగ్గించే ‘నీడిల్-ఫ్రీ’ విధానం సాధారణ సిరంజిలో ఉండే సూది స్థానంలో ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తారు. అందులోని మందును అధిక పీడనంతో అత్యంత...