రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై MDR.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!
రాజనీతి | జాతీయ వార్తలు | సెప్టెంబర్ 28, 2026 రూ.2,000కు మించిన కొన్ని UPI చెల్లింపులపై Merchant Discount Rate (MDR) విధించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు చేరింది. ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రం, RBI, NPCI నుంచి వివరణ కోరింది. అయితే కొత్త విధానంపై తక్షణ మధ్యంతర స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అక్టోబర్ 15 నుంచి కొత్త విధానం కేంద్రం ప్రకటించిన ఫ్రేమ్వర్క్ ప్రకారం రూ.2,000కు మించిన నిర్దిష్ట Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తించనుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు...