తిరుమలలో ఇక స్మార్ట్‌ బస్టాప్‌లు.. ధర్మరథాలకు డిజిటల్‌ టచ్‌!

రాజనీతి | తిరుమల | సెప్టెంబర్‌ 26, 2026 తిరుమలలో భక్తుల ఉచిత రవాణా సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీవారి ధర్మరథాల ద్వారా ఉచిత బస్సు సేవలు అందుతున్న నేపథ్యంలో.. బస్టాప్‌లను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. బస్టాప్‌లలో స్మార్ట్‌ సౌకర్యాలు బస్సు ఎప్పుడు వస్తుందో ఇక ఎదురుచూపులు అక్కర్లేదు.. తిరుమలలో భక్తుల కోసం స్మార్ట్‌ బస్టాప్‌లకు టీటీడీ ప్రణాళిక! భక్తులు బస్సు కోసం ఎంతసేపు వేచి ఉండాలో తెలుసుకునేలా డిజిటల్‌ సమాచార వ్యవస్థను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే తిరుమలలోని 20 బస్టాప్‌లలో డిజిటల్‌...