ఏపీలో పింఛన్ల పంపిణీ వేళల్లో మార్పు.. అక్టోబర్‌ 1న మధ్యాహ్నం నుంచే!

రాజనీతి | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. సాధారణంగా నెల మొదటి తేదీ ఉదయం నుంచే పింఛన్లను ఇంటింటికీ అందిస్తుండగా.. అక్టోబర్‌ 1న మాత్రం మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ మార్పుకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఉదయం బ్యాంకు నుంచి నగదు.. మధ్యాహ్నం పింఛన్లు అక్టోబర్‌ 1 ఉదయం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్లి పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును డ్రా చేసుకుంటారు. నగదు సేకరణ పూర్తయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించనున్నారు. వరుస సెలవులు.. సమ్మె...