గురజాల జగన్మోహన్పై తప్పుడు ప్రచారమా..? వైసీపీపై కాటారి హేమలత ఘాటు ఫైర్!
చిత్తూరు( రాజనీతి ): చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్పై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత కాటారి హేమలత ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ... పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జగన్ మోహన్ పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంపై పార్టీ శ్రేణులకు పూర్తి విశ్వాసం ఉందని హేమలత తెలిపారు. కూటమి ప్రభుత్వ...