పవన్ కల్యాణ్తో వంగవీటి రాధా భేటీ.....
రాజనీతి | మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర భేటీ చోటుచేసుకుంది. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరిలో సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగా సాగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాత పరిచయాలు.. తాజా రాజకీయాలపై మాటామంతీ పవన్ కల్యాణ్, వంగవీటి రాధాకృష్ణకు గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన పరిచయం ఉంది. ఈ సమావేశంలో అప్పటి రాజకీయ అనుభవాలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ప్రచారానికి సంబంధించిన అంశాలను కూడా ఇద్దరూ గుర్తుచేసుకున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ రాష్ట్రంలో త్వరలో...