కుటుంబంతో చంద్రబాబు విదేశీ పర్యటన.. మూడు రోజుల విరామం
రాజనీతి | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనను పూర్తిగా వ్యక్తిగతంగా, కుటుంబంతో కలిసి చేపడుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. అధికారిక పర్యటన కాకపోవడంతో ఆయన వెళ్లే దేశం, పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికార వర్గాలు వెల్లడించలేదు. కుటుంబంతోనే పర్యటన వరుసగా పాలనా సమీక్షలు, జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉన్న చంద్రబాబు.. కొద్దిరోజుల పాటు కుటుంబంతో గడిపేందుకు ఈ విరామాన్ని కేటాయించినట్లు సమాచారం. పర్యటనలో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారని సంబంధిత నివేదికలు పేర్కొంటున్నాయి. 28న తిరిగి అమరావతికి మూడు...