కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు
రాజనీతి | శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై వాన మేఘాలు విరుచుకుపడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వాతావరణ వ్యవస్థ కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వరకు గాలివేగం నమోదైంది. కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర అల్పపీడనం సెప్టెంబర్ 23 రాత్రి 11 గంటల నుంచి 24వ తేదీ తెల్లవారుజాము 1 గంట మధ్య కళింగపట్నం నైరుతి వైపు తీవ్ర అల్పపీడనం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఇది వాయవ్య దిశగా...