విజువల్స్,యాక్షన్లో భారీ స్కేల్ కానీ ‘పారడైజ్’ కథ తడబడింది!
రాజనీతి | సినిమా డెస్క్:ది పారడైజ్ రివ్యూ.. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్పై భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘ది పారడైజ్’. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సావారి సమాజం ఎదుర్కొనే అణచివేత, గుర్తింపు కోసం జరిగే పోరాటాన్ని జాదల్ పాత్ర చుట్టూ కథగా మలిచారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంలో నాని, మోహన్బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు నటించారు. కథ ఏంటంటే.. సమాజంలో గుర్తింపు, హక్కులు లేకుండా జీవించే సావారి వర్గం నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఈ సమాజంపై షికంజా మాలిక్ (మోహన్బాబు) ఆధిపత్యం కొనసాగుతుంది. జైలు నుంచి తిరిగి వచ్చిన...