అభివృద్ధికి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పీడ్.. వెన్నంటే పీఏ కుమారస్వామి!
చిత్తూరు (రాజనీతి):చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల నుంచి వచ్చే వినతులు, స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారానికి అవసరమైన సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే కార్యాలయం కీలకంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పీఏ కుమారస్వామి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తున్నారని చెబుతున్నారు.చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా రహదారులు, వీధిలైట్లు, కాలువలు వంటి మౌలిక వసతుల పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇటీవల హెచ్ఏఎం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే...