వాల్మీకిపురం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

రాజనీతి | వాల్మీకిపురం | అన్నమయ్య జిల్లా: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో అన్నమయ్య జిల్లాలో కలకలం రేగింది. వాల్మీకిపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణనష్టం జరుగుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదుపుతప్పిన బస్సు.. ఒక్కసారిగా బోల్తా వాల్మీకిపురం సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులే ముందుగా...