చిత్తూరుకు అభివృధి జాతర!... ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్....

చిత్తూరు( రాజనీతి ):చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 123 నగర, పురపాలక సంఘాల్లో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ రూ.60 కోట్ల హెచ్ఏఎం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పట్టణాలు, నగరాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. చిత్తూరు నగర అభివృద్ధికి గతంలో...