మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వేళ LPGపై ఆందోళన.. దేశీయ సరఫరాకు ఇబ్బంది లేదన్న హర్దీప్‌ పూరి

రాజనీతి | న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్‌ సరఫరాపై సోషల్‌ మీడియాలో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. LPG సిలిండర్ల కొరత ఏర్పడబోతోందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి స్పష్టత ఇచ్చారు. దేశీయ వినియోగదారులకు LPG సరఫరాను కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ దిగుమతులు, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.  గల్ఫ్‌ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. గతంలో భారత్‌ అవసరమైన LPGలో సుమారు 60 శాతం గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో సరఫరా మార్గాలను విస్తరించి అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా తదితర...