ఏపీకి వర్ష గండం.. అప్రమత్తమైన యంత్రాంగం
రాజనీతి | అమరావతి: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాల తీవ్రత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ముందున్న రెండు రోజులు కీలకం బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం ప్రస్తుత వాతావరణ వ్యవస్థ బలపడితే దాని ప్రభావం కోస్తాంధ్రతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలపైనా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల నేపథ్యంలో...