వైరల్ వీడియోతో కదిలిన ఎమ్మెల్యే.. వృద్ధ మహిళకు వెంటనే అండ!...రోజా చౌదరి
చిత్తూరు(రాజనీతి): ఓ వృద్ధ మహిళ వద్ద రూ.3 వేలు తీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వెంటనే స్పందించారు. విషయం తెలుసుకున్న ఆయన తన కార్యాలయ సిబ్బందిని మహిళ వద్దకు పంపించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు అండగా నిలిచి, అవసరమైన దుస్తుల ఖర్చును స్వయంగా చెల్లించారు. సిబ్బంది వీడియో కాల్ ద్వారా మహిళను ఎమ్మెల్యేతో మాట్లాడించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే స్పందించి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా రోజా చౌదరి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వృద్ధ...