టెక్నాలజీ, ఏఐతో కలిసి ముందుకు సాగాలి:సీఎం చంద్రబాబు

విజయవాడ: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టీచర్లు తమ బోధనా పద్ధతులను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పాఠాలు దాటి.. ప్రతిభను గుర్తించాలి ఒక విద్యార్థి భవిష్యత్తును కేవలం పుస్తక జ్ఞానం నిర్ణయించదని.. అతడిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన దిశ చూపించడమే ఉపాధ్యాయుడి అసలు బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంచేలా బోధన సాగాలని సూచించారు. ఏఐతో...