2029లోగా మరో 3 డీఎస్సీలు: మంత్రి నారా లోకేశ్‌

విజయవాడ: రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతో పాటు.. భవిష్యత్తులో ఎదురయ్యే పోటీని తట్టుకునేలా అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. తరగతి గదిలో మార్పు రావాలి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యా బోధనలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడం కాకుండా.. ప్రాథమిక అంశాలపై బలమైన అవగాహన, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, పోటీ పరీక్షలను ఎదుర్కొనే నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు....