మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థుల ప్రవర్తనను గమనించాలని ప్రధానమంత్రి సూచన

న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, మొబైల్‌–స్క్రీన్‌ వినియోగం పెరగడం వంటి సమస్యలపై టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులతో మోదీ సమావేశమై ఈ అంశాలపై చర్చించారు. మాదకద్రవ్యాల ముప్పు, స్క్రీన్‌ వ్యసనంపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ మార్కుల కంటే విద్యార్థి ప్రవర్తన ముఖ్యం విద్యార్థి ఎంత మార్కులు సాధిస్తున్నాడన్నదే కాకుండా.. అతడి రోజువారీ ప్రవర్తన, ఆసక్తులు, ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. పిల్లల్లో అకస్మాత్తుగా వచ్చే ప్రవర్తనా...