12వ వార్డులో గోపీనాథ్‌ జోరు..!పేదల గడప తొక్కిన కూటమి నేతలు.. పింఛన్‌తో భరోసా!

ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్‌తో కలిసి గోపీనాథ్‌ పింఛన్ల పంపిణీ.... చిత్తూరు: 12వ వార్డులో కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు డివిజన్‌ ఇన్‌చార్జి గోపీనాథ్‌ నాయకత్వం మరింత ఊపునిచ్చింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల గడప వద్దకే తీసుకెళ్లి అందించే కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి 12వ వార్డు డివిజన్‌ ఇన్‌చార్జి గోపీనాథ్‌ ముందుండి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.స్థానికంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పింఛన్లు సకాలంలో అందేలా గోపీనాథ్‌ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి...