12వ డివిజన్‌లో గోపీనాథ్‌... టీడీపీకి కొత్త ఊపు!...

సమస్య కనిపిస్తే చాలు.. పరిష్కారం దిశగా అడుగు!... కార్యకర్తలకు అండగా.. ప్రజలకు అందుబాటులో.. గోపీనాథ్‌ స్పీడ్‌కు బ్రేకుల్లేవ్‌!... చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్‌ ఆదేశాల మేరకు 12వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపు తీసుకొచ్చే దిశగా డివిజన్‌ ఇన్‌చార్జి గోపీనాథ్‌ చురుగ్గా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజా సమస్యలను గుర్తించడం.. వాటి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.. కార్యకర్తలను సమన్వయం చేయడం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. దీంతో డివిజన్‌లో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని పార్టీ నాయకులు అంటున్నారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండా... 12వ డివిజన్‌లో తాగునీరు, పారిశుద్ధ్యం,...