టమోటా రైతుకు కష్టాలే మిగిలాయి!
అనంతపురం: పంట బాగా పండితే రైతు ముఖంలో ఆనందం కనిపించాలి. కానీ అనంతపురం జిల్లాలో టమోటా సాగు చేసిన రైతుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తోటల్లో దిగుబడి సిద్ధంగా ఉన్నా.. మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పంటను కోసి మార్కెట్కు తీసుకెళ్లిన తర్వాత వచ్చే ఆదాయం కంటే కూలీలు, రవాణా వంటి ఖర్చులే ఎక్కువగా మారుతున్నాయి. టమోటా సాగుకు ఎకరాకు భారీగా పెట్టుబడి పెట్టిన రైతులకు ప్రస్తుత ధరలు ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. సాగు ప్రారంభం నుంచి మొక్కల సంరక్షణ, కట్టెలు, దారం, మందులు, కూలీల వరకు అనేక ఖర్చులు భరించిన తర్వాత దిగుబడి చేతికొచ్చింది....