ఢిల్లీలో వేగంగా పెరుగుతున్న స్వైన్ఫ్లూ కేసులు.. 17 రోజుల్లో 1,268 కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో స్వైన్ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కేవలం 17 రోజుల్లోనే 1,268 కొత్త హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది ఢిల్లీలో నమోదైన మొత్తం హెచ్1ఎన్1 కేసుల సంఖ్య 2,612కు చేరింది. వర్షాకాలం నేపథ్యంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. 17 రోజుల్లోనే భారీ పెరుగుదల ఆగస్టు 10 నాటికి ఢిల్లీలో 1,344గా ఉన్న హెచ్1ఎన్1 కేసులు.. ఆగస్టు 27 నాటికి 2,612కు పెరిగాయి. ఇదే సమయంలో 3,300కు పైగా ఇన్ఫ్లుయెంజా-ఏ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వర్షాలు, వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రతల్లో మార్పులు వైరస్ వ్యాప్తికి అనుకూల...