పీజీ వైద్యులకు ఇక 24 గంటలే!

అమరావతి: పీజీ వైద్య విద్యార్థుల పని గంటలు, సెలవుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిబంధనలు ప్రకటించింది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి వరుసగా విధుల్లో ఉంచకూడదని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ విష్ణువర్ధన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నైట్‌ డ్యూటీ తర్వాత సెలవు రాత్రి విధులు నిర్వహించిన పీజీ వైద్యులకు మరుసటి రోజు తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలని డీఎంఈ స్పష్టం చేశారు. అలాగే ప్రతి వారం ఒక రోజు పూర్తిస్థాయి వారాంతపు సెలవు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలను అమలు చేయడంలో...