సదరం సర్టిఫికెట్‌ ఇక వాట్సప్‌లోనే!

అమరావతి: దివ్యాంగులు, అంగవైకల్యం ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై సదరం సర్టిఫికెట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సదరం సర్టిఫికెట్‌ ఆధారంగా పింఛన్లు సహా వివిధ ప్రభుత్వ ప్రయోజనాలు పొందే వారికి ఈ సేవ ఉపయోగపడనుంది. వాట్సప్‌లోనే అన్ని సేవలు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. ఇంటి నుంచే స్లాట్‌ బుకింగ్ మెడికల్‌ పరీక్షల తర్వాత సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సప్‌ గవర్నెన్స్‌లోకి సదరం సేవలను కూడా తీసుకొచ్చింది. సదరం సర్టిఫికెట్‌కు సంబంధించిన స్లాట్‌ అందుబాటు తెలుసుకోవడం,...