*ఎయిడ్స్ సురక్ష, నేత్ర దాన ప్రాముఖ్యత, టి. బి. పై విద్యార్థులకు అవగాహన సదస్సు *95-95-99 లక్ష్యాల సాధనకు కృషి: డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ *

రాజనీతి కలికిరి , ఆగస్టు 28 ఎయిడ్స్ సురక్ష కొరకు జనసమీకరణ చేద్దాం. మరియు నేత్ర దానం చేద్దాం ఇద్దరి జీవితాలలో వెలుగు నింపుదాం అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.అంతర్జాతీయ యువజన మాసోచ్చావాలు మరియు నేత్రదాన పక్షోత్చావాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి పర్యవేక్షణ లో దిశ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని ప్రభుత్వపోలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఇంచార్జి ప్రిన్సిపాల్ రాజారావ్ అధ్యక్షతన మొబైలిజషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష, నేత్రధాన పక్షోత్చావాల కార్యక్రమం పై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా...