అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్‌..

రాజనీతి ప్రత్యేకం: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ పండుగకు సర్వం సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే ఈ పండుగ తేదీపై ఈసారి నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం నిర్వహించుకోవాలని సూచించారు. పౌర్ణమి తిథి ఎప్పటివరకు? ఈ ఏడాది శ్రావణ శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. పౌర్ణమి తిథి ఆగస్టు 28 ఉదయం వరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రోజే రాఖీ పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. దీంతో ఆగస్టు 27నా? 28నా?...