నేపాల్ వరదల్లో ఏపీ యాత్రికులు మంత్రి లోకేశ్‌ సమీక్ష..

అమరావతి:నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీకి చెందిన ఏడుగురు యాత్రికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ కాగా.. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీ మంత్రి **నారా లోకేశ్** యాత్రికుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ ఢిల్లీ భవన్‌ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రికి తెలియజేస్తున్నారు. ముగ్గురి కోసం గాలింపు ప్రస్తుతం ఆచూకీ లభించని వారిలో **కుప్పం...