లక్ష్మీపురం సమస్యకు చిత్తూరు నియోజకవర్గ 12వ డివిజన్‌ ఇంచార్జి గోపీనాథ్‌ ‘రూట్‌’ క్లియర్‌... వంతెన, సీసీ రోడ్లకు హామీ...!

ఇన్నాళ్లూ ఇబ్బందులే.. ఇక అభివృద్ధి బాటలో లక్ష్మీపురం!.... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): లక్ష్మీపురం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఎన్నాళ్లుగానో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల సమస్యలను చిత్తూరు నియోజకవర్గం 12వ డివిజన్‌ టీడీపీ ఇంచార్జి గోపీనాథ్‌ స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. వాటి పరిష్కారానికి చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు.లక్ష్మీపురం ప్రాంతంలో ప్రధానంగా వంతెన, సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయని స్థానికులు గోపీనాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలు కురిసిన సమయంలో రహదారులు అధ్వానంగా మారడం, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటం, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెళ్లేందుకు కూడా...