రాజకీయ ఎదుగుదలకు అడ్డంకులు....న్యాయం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడికి వినతి

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): క్షేత్రస్థాయిలో తన రాజకీయ ఎదుగుదలను కొందరు స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని చిత్తూరు రూరల్ మండలం అనంతాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ప్రవీణ్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు విన్నవించారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి న్యాయం చేయాలని కోరారు.స్థానిక నాయకుడు జయచంద్ర నాయుడు తనను పార్టీలో ఎదగనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రవీణ్ ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి, పోలీసుల ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎమ్మెల్యేను కలవకుండా అడ్డుకున్నారని, అంతేకాకుండా తన మనుషులతో దాడి చేయించారని ఆరోపించారు.పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో పాటు, పార్టీ నుంచి సస్పెండ్...