సాంబయ్య కండ్రిగలో వాహన తనిఖీలు... ఎస్ఐ శివశంకర్

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు పట్టణంలోని సాంబయ్య కండ్రిగ ప్రాంతంలో చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ శివశంకర్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలను ఆపి డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, ఇతర పత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, వాహనాలను నడిపే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకుండా రాకపోకలు సాగించడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడవద్దని హెచ్చరించారు.అనంతరం ఎస్‌ఐ శివశంకర్‌ మాట్లాడుతూ.. ప్రజల భద్రత...