సమస్య ఏదైనా.. స్పందన మాత్రం సత్వరం!....మునిచంద్ర
చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):విద్యుత్తు సేవల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర స్పందన అందిస్తున్న అధికారిగా ఏపీఎస్పీడీసీఎల్ చిత్తూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఆపరేషన్) ఎం. మునిచంద్ర గుర్తింపు పొందుతున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు వినియోగదారుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేస్తున్నారు.విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు, సాంకేతిక సమస్యలు, వినియోగదారుల ఫిర్యాదులు తదితర అంశాలపై సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై సమాచారం అందిన వెంటనే సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుని పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రత్యేక...