ఢిల్లీలో మళ్లీ హెచ్‌1ఎన్‌1 కలకలం.. ఆరు రెట్లు పెరిగిన కేసులు!

రాజనీతి ఆరోగ్య ప్రత్యేక కథనం | ఆగస్టు 11, 2026 దేశ రాజధాని ఢిల్లీలో హెచ్‌1ఎన్‌1 (స్వైన్‌ఫ్లూ) కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో 1,344 హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 229 కేసులతో పోలిస్తే ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. వర్షాకాలం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణ ఫ్లూతో హెచ్‌1ఎన్‌1 లక్షణాలు పోలి ఉండటంతో చాలామంది ప్రారంభంలో దాన్ని సాధారణ వైరల్‌ జ్వరంగా భావించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే...