కొలంబియాలో భారీ భూకంపం.. 21 మంది మృతి!
రాజనీతి అంతర్జాతీయ ప్రతినిధి | ఆగస్టు 10, 2026 కొలంబియాలో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొలంబియా భూవిజ్ఞాన సేవల వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం పసిఫిక్ తీరంలోని చోకో ప్రావిన్స్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మార్ గ్రామం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రం సుమారు 103 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావం చోకో...