కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా ఎంట్రీ.. ‘ఇంద్రపుత్ర’ ప్రకటన
రాజనీతి సినీ ప్రతినిధి | ఆగస్టు 10, 2026 యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు పాన్ ఇండియా బరిలోకి అడుగుపెట్టబోతున్నారు. ‘ఇంద్రపుత్ర’ పేరుతో తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని జీ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. మైథలాజికల్ యాక్షన్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా కిరణ్ కెరీర్లో మరో విభిన్న ప్రయత్నంగా నిలవనుంది. ఇప్పటివరకు ప్రేమకథలు, కమర్షియల్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఈసారి పౌరాణిక అంశాలు, యాక్షన్, ఫాంటసీ కలగలిసిన కథలో కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీకాంత్ పుప్పాల తెరకెక్కించనుండగా, ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. జీ స్టూడియోస్, నిర్మాత ప్రేరణ అరోరా ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘ఇంద్రపుత్ర’ను భవిష్యత్తులో విస్తరించే...