ప్రాంతీయ పార్లమెంటరీ ఫోరంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. స్థిరమైన అభివృద్ధికి సమన్వయ చర్యలపై పిలుపు
రాజనీతి ప్రతినిధి, న్యూఢిల్లీ | ఆగస్టు 3, 2026 దక్షిణాసియా ప్రాంతీయ పార్లమెంటరీ ఫోరం – ఇండియా చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన "వాతావరణ మార్పులను తట్టుకోగల భారతదేశం (Climate Resilient India)" అంశంపై జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో రాజంపేట లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో వాతావరణ మార్పుల ప్రభావం, ప్రకృతి వైపరీత్యాల నివారణ, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి వంటి కీలక అంశాలపై జరిగిన చర్చల్లో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు. వ్యవసాయం, నీటి వనరులు, పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటి...