రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా షేక్ రెడ్డి మస్తాన్ నియామకం....
మైనార్టీల సంక్షేమమే లక్ష్యం: షేక్ రెడ్డి మస్తాన్... చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు: భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చిత్తూరు నగరంలోని అశోక్పురానికి చెందిన షేక్ రెడ్డి మస్తాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా ప్రకటించారు. షేక్ జవహర్ భాషా, ముంతాజ్ దంపతుల కుమారుడైన మస్తాన్ విద్యార్థి దశ నుంచే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చురుకుగా పనిచేశారు.2014 నుంచి ఏబీవీపీలో కళాశాల ఉపాధ్యక్షుడు, పీసీఆర్ కళాశాల అధ్యక్షుడు, చిత్తూరు బాగ్ కన్వీనర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కన్వీనర్గా 2020 వరకు...