హెచ్‌ఐవీ చికిత్సలో కొత్త ఆశ.. తొలి పరీక్షలో సక్సెస్ అయిన నూతన ఔషధం-శివ శంకర్. చలువాది
హెచ్‌ఐవీ కొత్త మందు వీహెచ్-499తో ఆశాజనక ఫలితాలు తొలి మానవ పరీక్షలో వైరల్ లోడ్ గణనీయంగా తగ్గుదల 23 మందిపై నిర్వహించిన ఫేజ్-2ఏ ట్రయల్ తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదన్న పరిశోధకులు లెనాకాపవిర్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం తదుపరి ఫేజ్-3 పరీక్షల తర్వాతే తుది నిర్ణయం హెచ్‌ఐవీ చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. వీహెచ్-499 పేరుతో అభివృద్ధి చేసిన కొత్త ఔషధం తొలి మానవ క్లినికల్ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు ఇచ్చింది. ఈ మందు హెచ్‌ఐవీ-1 వైరస్ శరీరంలో విస్తరించకుండా అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలు ‘క్లినికల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హెచ్‌ఐవీ వైరస్‌ను కప్పి ఉంచే క్యాప్సిడ్...