ఏపీకి మూడు రోజుల వర్ష హెచ్చరిక
రాజనీతి ప్రతినిధి, అమరావతి | ఆగస్టు 1, 2026 ఉత్తర కోస్తాలో భారీ వర్షాల అవకాశం.. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ...